మెట్రో అంశంపై సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిపై ప్రచారం అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవాలు, దుష్ప్రచారంలో భాగమే. హైదరాబాద్ మెట్రో విస్తరణ, కొత్త కారిడార్ల అభివృద్ధి, ప్రజలకు మరింత మెరుగైన ప్రజా రవాణా సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నిరంతరం కృషి చేస్తున్నారు. మెట్రో విస్తరణకు అవసరమైన నిధులు, అనుమతులు, ప్రణాళికల అమలులో ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోంది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలు, వక్రీకృత కథనాలు ప్రచారం చేయడం బాధ్యతారాహిత్య చర్య. ఇటువంటి అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం చేసి ప్రజల్లో అపోహలు సృష్టించే వ్యక్తులు, సంస్థలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి.