10,017 ఇండ్లు కూల్చి 5000 కోట్లతో గాంధీ విగ్రహం అంటూ సోషల్ మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. గాంధీ విగ్రహానికి రూ. 5,000 కోట్లు ఖర్చవుతాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి విగ్రహ నిర్మాణానికి సుమారు రూ. 70 కోట్లు మాత్రమే ఖర్చవుతుంది. అక్కడ నిర్మించనున్న విజ్ఞాన మందిరానికి రూ. 100 కోట్లకు పైగా వ్యయం అవుతుందని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు.